సి.డి.ఎమ్.ఏ ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికులకు వైద్య చికిత్సలు చేయించడం కోసం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసిన మున్సిపల్ కమీషనర్ త్రయంభకేశ్వర్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆరుగురు డాక్టర్లు పాల్గొనడం జరిగింది. సి.డి.ఎమ్.ఏ ఆదేశాల మేరకు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులలో ప్రబలుతున్న రోగాల దృష్ట్వా
ప్రతి మూడు నెలలకు ఒకసారి పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు రావడంతో ఇప్పుడు కార్యక్రమంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి కార్మికులందరికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి మాత్రలు అందజేయడం జరిగిందని, మళ్ళీ మూడు నెలల తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయబడుతుందని, ఈ అవకాశాన్ని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది వినియోగించుకోవాలని సూచించిన మున్సిపల్ కమీషనర్ త్రయంభకేశ్వర్.
Follow Us on:
Subscribe Us :
Facebook:
0 Comments